Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?
Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?
Bananas |(నంది పత్రిక)అక్టోబర్ 13. అరటి పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కాలమేదైనా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది అరటి పండ్లను కొని తింటుంటారు. అయితే, పండ్లపై చాలా మందిలో ఓ సందేహం వ్యక్తమవుతుంది. అదేంటంటే.. అరటి పండ్లను తిన్న అనంతరం మంచినీళ్లు తాగొచ్చా? ఒక వేళ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అవుతుందా? అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. అరటి పండ్లను తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయనడంలో అర్థం లేదని పేర్కొంటున్నారు. పండ్లను తిన్న తర్వాత నీళ్లను నిరభ్యంతరంగా తాగొచ్చని, తిన్న తర్వాత నీళ్లను తాగితేనే మంచిదంటున్నారు. రోజుకు ఒకటి, రెండు అరటి పండ్లను తినొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అరటి పండ్లు సులువుగా జీర్ణమవుతాయి. తిన్న కేవలం గంటలోపే వీటిలో ఉండే పోషకాలన్నింటిని శరీరం శోషించుకుంటుంది. తక్కువ సమయంలో పోషకాలు, శక్తి లభించాలంటే అరటి పండ్లను తప్పకుండా తీసుకోవాలి. అరటి పండ్లను పొటాషియం అధికంగా ఉంటుంది. మీడియం సైజ్ పండును తీసుకుంటే 420 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. రోజుకు రెండు పండ్లను తీసుకుంటే హైబీపీ అదుపులోకి వస్తుంది. బీపీ తగ్గించడంలో పొటాషియం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు సైతం ఆరోగ్యంగా ఉండి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.
Comment List